దళిత మహిళా సర్పంచ్ అవమానంపై కాంగ్రెస్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: వంగూరు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల సర్పంచ్ కాశమ్మను ఎమ్మెల్యే అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత మహిళా సర్పంచ్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుందుభి వాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, సీఎం సొంత మండలంలోనే ఇలాంటి అరాచకాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు వంగూరులో జరిగిన పరామర్శ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.