రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Telangana

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని BJP Telangana వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి లక్ష్యాలను గాలికొదిలేసి, తామే బీసీ పక్షపాతులమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవలేక ప్రతిసారీ విఫలమవుతున్న నాయకుడిని ప్రమోట్ చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.