జడ్చర్లలో వైభవంగా విజయదశమి వేడుకలు: లేజర్ షోతో కనువిందు చేసిన ఉత్సవాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: జడ్చర్ల

జడ్చర్ల పట్టణంలోని బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.