పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా తత్వం చిత్రం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథాంశంతో తత్వం చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు. దినేష్తేజ్, దష్విక కె జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మర్డర్ మిస్టరీతో పాటు పాత్రల సైకాలజీని ఈ చిత్రంలో చూపించామని ఆయన వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పలు కష్టాలను ఎదుర్కొన్నామని, కారు ప్రమాదం కారణంగా ఆలస్యమైందని అర్జున్ కోలా పేర్కొన్నారు.