రామాపురంలో పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కొట్టే వెంకటేశ్వర్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరికుంటపాడు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ మూడో విడత ఏర్పాట్లను జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకుని జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.