హైదరాబాద్లో తాత్కాలికంగా సమ్మెను విరమించిన వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మహానగరంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డితో వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో ప్రతిపాదిత సమ్మె నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించారు. నగరవాసుల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవలు యథావిధిగా కొనసాగిస్తామని, 2017 నాటి పాత ధరలను పెంచాలని కోరుతూ సమర్పించిన వినతిపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు.