పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

ఈవీఎంలు తొలగించి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా సహా పలు దేశాలు బ్యాలెట్ పద్ధతినే పాటిస్తున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్థి బరిలో ఉంటారని ఆమె మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.