కుటుంబ కలహం: ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్యపై భర్త తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: రమేష్
స్థలం: డెహ్రాడూన్
తన భర్త పప్పూ గిర్ధారీ తనను వేధిస్తున్నాడని ఉత్తరాఖండ్ క్రీడల శాఖ మంత్రి రేఖా ఆర్య ఆరోపించారని, అయితే ఆమె అక్రమంగా రూ.210 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆమె భర్త ఎదురుదాడికి దిగారని డెహ్రాడూన్ వర్గాలు వెల్లడించాయి. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ఆశ్రయించడంతో ఈ కుటుంబ కలహం జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది.