అసెంబ్లీ సాక్షిగా తనను బెదిరించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణస్వామి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్.ఎన్. నారాయణస్వామిపై తోటి ఎమ్మెల్యే రూపకళ శశిధర్ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. తన వెనుక కూర్చున్న రూపకళ తన టేబుల్ పై కొట్టి హెచ్చరించడంతో భయపడ్డానని నారాయణస్వామి ఆరోపించారు. కోలార్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న ఈ అంతర్గత విభేదాలు, ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.