బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా భూస రాజు నియామకం
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా తూంపల్లి గ్రామానికి చెందిన భూస రాజు నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు ఆయనకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ నియామకం పట్ల మండలంలోని పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాన్ని కదిలిస్తానని భూస రాజు తెలిపారు.