గద్వాల జిల్లాలో పోలీసుల ప్రత్యేక అవగాహన: కోదండపురం పరిధిలో ముమ్మర ప్రచారం
రిపోర్టర్: మహేష్
స్థలం: జోగులాంబ గద్వాల
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం కోదండపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పుటాన్ దొడ్డి గ్రామంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ప్రాధాన్యత తదితర కీలక అంశాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్లు ఎస్పీ జోగులాంబ గద్వాల వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు నేరాల నియంత్రణ మరియు భద్రతా చర్యలపై అవగాహన పెంచేందుకు తగిన సూచనలు అందించారు.