ఓటు చోరీ దేశద్రోహంతో సమానమంటూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఖమ్మం
ప్రతి పౌరుడి ఓటు పవిత్రమైనదని, దానిని దొంగిలించడం దేశద్రోహంతో సమానమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ సత్యాన్ని వెలికితీసేందుకు రాహుల్ గాంధీ మూడేళ్లుగా పోరాడారని, నేడు దేశం ముందరే ఆ వాస్తవం స్పష్టంగా నిలిచిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో రాజకీయ చర్చ తీవ్రమైంది.