ఆదరణ ఆశ్రమ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ: మామిడి సోమయ్య

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

స్వర్గీయ మామిడి రామయ్య వర్ధంతి సందర్భంగా ఎమ్మార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఆదరణ విద్యార్థుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య సరుకులను ఆదరణ వ్యవస్థాపక అధ్యక్షుడు జే. మాధవరావుకు అందించారు. అనాథలను ఆదుకోవడం అందరి బాధ్యతని சோమయ్య పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా నిరుపేద పిల్లలకు విద్య అందిస్తున్న ఆదరణ సేవలను ఆయన అభినందించారు.