ఆసియన్ గేమ్స్ మారథాన్ పోటీలలో రజతం గెలిచిన సావన్ బర్వాల్
రిపోర్టర్: హరి
స్థలం: India
ఆసియన్ గేమ్స్ మారథాన్ పోటీలలో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ చారిత్రాత్మక రజత పతకం సాధించడంపై ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ డా. శ్రీరామ్ నేనే (Dr. Shriram Nene) హర్షం వ్యక్తం చేశారు. సుమారు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత భారత్ కు మారథాన్ విభాగంలో పతకం దక్కడం అద్భుతమైన విషయమని ఆయన కొనియాడారు. ఈ ఘనత సాధించడం ద్వారా సావన్ బర్వాల్ దేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారని, రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.