గౌరవెల్లిలో బెల్ట్ షాపులను మూసివేయాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు వినతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అక్కన్నపేట

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో రాత్రింబవళ్ళు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని, వెంటనే మూసి వేయాలని కోరుతూ గ్రామానికి చెందిన నందరాపు సంపత్ ఆదివారం హుస్నాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బెల్ట్ షాపులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.