టెక్ రంగంలో సంచలనం: శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్లు విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

దేశీయ టెక్ మార్కెట్లోకి సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9600 సిరీస్ ప్రాసెసర్లు విడుదలయ్యాయని ప్రసాద్ (Prasad Tech in Telugu - నంబర్ 1 తెలుగు టెక్ రివ్యూయర్) వెల్లడించారు. రెండు నానోమీటర్ ప్రక్రియతో తయారైన ఈ చిప్సెట్లు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయని తెలిపారు. అలాగే తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు శక్తివంతమైన సీపీయూ పనితీరును కలిగి ఉన్నాయని ఆయన పేర్కొంటూ వివరాలను పంచుకున్నారు.