ప్రసూతి వార్డుల్లో విద్యుత్ తీగలతో పసికందుల ప్రాణాలకు తీవ్ర ముప్పు
రిపోర్టర్: రమేష్
స్థలం: పశ్చిమగోదావరి
సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని ప్రసూతి వార్డులు, బేబీ కేర్ యూనిట్లు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ఆకివీడు ఆసుపత్రుల్లో విద్యుత్ తీగలు చిందరవందరగా బయటకు వేలాడుతుండటంతో బాలింతలు, పసికందుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఆదిలాబాద్ రిమ్స్ దుర్ఘటన నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లోపాలను తక్షణమే సరిదిద్దాలని, అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.