బీసీలకు ద్రోహం చేసిందంటూ వైకాపా అధినేత జగన్పై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపాటు
రిపోర్టర్: శివ
స్థలం: మంగళగిరి
తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైకాపా హయాంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మళ్లీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే న్యాయస్థానాల్లో అడ్డుకోవాలని వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.