యూనెస్కో తాత్కాలిక జాబితాలో దేశం నుండి ఐదు కొత్త ప్రదేశాలు
రిపోర్టర్: శివ
స్థలం: Madhya Pradesh
మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలతో పాటు సత్యాగ్రహానికి సంబంధ ప్రాంతాలు యూనెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ తాజా చేరికలతో భారత్ తరఫున యూనెస్కో తాత్కాలిక జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది. దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ వేదికపై సముచితంగా చాటిచెప్పే ఈ ఘనతపై పీఐబీ కల్చర్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ దీనిని గర్వించదగ్గ మైలురాయిగా అభివర్ణించింది.