నర్సంపేటలో పేకాట స్థావరంపై విరుచుకుపడి ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం నాడు ఆకస్మిక దాడి చేశారు. పట్టణంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పదిహేడు వేల ఆరు వందల యాభై రూపాయల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నర్సంపేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు.