అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా తగ్గిన ముడి చమురు ధరలు
రిపోర్టర్: శివ
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు మరియు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు వరుసగా నాలుగో రోజు పడిపోయాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 94 డాలర్ల దిగువకు పడిపోగా, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా భారీగా క్షీణించిందని జెపి మార్గన్ తదితర ఆర్థిక సంస్థలు స్పష్టం చేశాయి.