కేసీఆర్పై కాంగ్రెస్ వినూత్న నిరసన: కుంభకర్ణుడిగా మాజీ సీఎం పోస్టర్లు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad, Telangana
ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్పై వినూత్నంగా నిరసన తెలిపారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ 'కుంభకర్ణ నిద్ర'లో ఉన్నారని ఆరోపిస్తూ, ఆయనను కుంభకర్ణుడిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. వెయ్యి రోజులుగా ఆయన నిద్రపోతున్నారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయంగా ఈ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.