రూ.629 కోట్లకు పైగా విద్యుత్ చార్జీలు తగ్గించిన కూటమి సర్కార్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాంతానికి చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. వరుసగా రెండో ఏడాదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలపై ముై వేల కోట్ల భారం మోపారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని ఆమె తెలిపారు.