హైదరాబాద్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై జాతీయ సదస్సు నిర్వహణ
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు గాను సీఐఎస్సీఈ సంస్థ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా పాఠశాలల్లో అక్టోబర్ నెల నుంచి దశలవారీగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ తగిన రక్షణ కల్పించేలా ప్రత్యేక విధివిధానాలను రూపొందించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. నవంబర్ ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా ఈ జాతీయ సదస్సు కొనసాగనుంది.