తమిళనాట టీవీకే-కాంగ్రెస్ మధ్య ప్రధాని అభ్యర్థిత్వ పంచాయతీ!

రిపోర్టర్: మహేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా చేరినప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. విజయ్ దేశ ప్రధాని కాబోతున్నారని టీవీకే వర్గాలు ప్రకటిస్తుండగా, రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ను జూనియర్ భాగస్వామిగా ఉంచుతూ విజయ్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.