ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
వైద్యుల సలహా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్‌కిల్లర్లు, యాంటీబయోటిక్స్ మోతాదుకు మించి వాడితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.