విమానంలో భారీ కుదుపులతో ప్రయాణికుల భయాందోళన

రిపోర్టర్: గోపి స్థలం: ముంబయి

అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో భారీగా కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కామియా జానీ తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇదే తన చివరి ప్రయాణం కావొచ్చని, ఏదైనా జరిగితే తాను ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబయిలోని టెర్మినల్-2లో ల్యాండ్ కావాల్సిన విమానం నవీ ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా దిగిందని ఆమె పేర్కొన్నారు.