రాజకీయ అరంగేట్రంపై ప్రచారం: తమిళనాడులో ధనుష్ కీలక సన్నాహాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: చెన్నై

సినీనటుడు ధనుష్ రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా వేలాది మంది న్యాయ సలహాదారులను నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అని మీడియా వర్గాలు వెల్లడించాయి. తన అభిమాన సంఘాలను సంక్షేమ సేవా సంఘాలుగా మారుస్తూ జిల్లాలవారీగా కొత్త నిర్వాహకులను నియమిస్తున్న ఆయన, ప్రజలకు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలపై సలహాలు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.