యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు: కష్టపడితే అవకాశం వస్తుంది

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై ఢిల్లీ క్రికెటర్ ప్రియాంశ్ ఆర్య స్పందించారు. తనకు ఎలాంటి నిరాశ లేదని, వచ్చిన అవకాశాల పట్ల కృతజ్ఞతతో ఉంటానని ఆయన తెలిపారు. కఠిన పోటీలో నిలదొక్కుకునేందుకు మరింతగా శ్రమిస్తానని, తలుపులు తడుతూనే ఉంటానని ప్రియాంశ్ ఆర్య పేర్కొన్నారు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో సర్వీసెస్ జట్టుతో తలపడుతున్న నేపథ్యంలో పిచ్ పరిస్థితులు, మ్యాచ్ వ్యూహాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.