రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలకు మార్గగనుసమం: కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంపు, రేపల్లె ఆసుపత్రి అప్గ్రేడ్తో పాటు మొత్తం పన్నెండు అజెండా అంశాలకు అమాత్యులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.