హర్మూజ్ జలసంధి తెరిచేందుకు అమెరికాతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నామన్న ఇరాన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూయార్క్
అమెరికా తమ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనం ఎత్తివేత కోసం భవిష్యత్తులో దాడులు చేయబోమని ఇరాన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అమెరికా కోరుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.