మాక్ అసెంబ్లీ నిర్వహణపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతుండగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సభలో చర్చించే ధైర్యం లేకనే బీఆర్‌ఎస్ నేతలు మాక్ అసెంబ్లీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీని బహిష్కరించి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.