ఐఐటీ బొంబాయిలో విద్యార్థి మృతితో సెప్టెంబర్ పరీక్షలు వాయిదా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ముంబై
ఐఐటీ బొంబాయిలో విద్యార్థి సాహిిల్ వాకోడే మృతి నేపథ్యంలో క్యాంపస్లో చెలరేగిన నిరసనల కారణంగా సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరగాల్సిన మిడ్-సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 10, 11 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పరీక్షల నిర్వహణపై సమగ్ర విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.