ఉద్యోగులకు తీపి కబురు: పీఎఫ్ పరిధిలోకి అర్హులైన సిబ్బంది నమోదుకు ప్రత్యేక ప్రచారం

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh / Telangana

గత కాలపు నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి మరియు అర్హులైన ఉద్యోగులను పీఎఫ్ పరిధిలోకి నమోదు చేయడానికి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026ను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని యజమానులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా సంస్థల్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అర్హత కలిగిన సిబ్బందికి భవిష్య నిధి ప్రయోజనాలు దక్కేలా చూస్తామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.