పెన్షన్ల కోసం డబ్బులు అడిగేవారిని నమ్మకండి: సురేష్ రెడ్డి

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు మండలంలో సెప్టెంబర్ 7 నుండి కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కార్మికులు తమ వివరాలను సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందాలని జనసేన నేత సురేష్ రెడ్డి సూచించారు.

పెన్షన్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు. దళారుల మాటలు నమ్మకుండా నేరుగా సచివాలయ అధికారులను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని, మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.