మెదక్ సిద్దిపేట జిల్లాల్లో మాత్రమే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు

రిపోర్టర్: మహేష్ స్థలం: Telangana

గత ఎనిమిదేళ్లుగా కొన్ని జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతాలు నమోదవుతున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ (Telangana Weatherman - T. Balaji) వెల్లడించారు. ఈ ఏడాది కూడా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రమే అధిక వర్షాలు కురిసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 నుంచి ఈ ప్రాంతాలు మెరుగైన వర్షపాతాన్ని పొందుతూ అదృష్టాన్ని కలిగి ఉన్నాయని వివరించారు. ఈ మేరకు వాతావరణ సరళిపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.