నకిలీ నెంబర్ ప్లేట్లపై కొరడా: వాహనాలు సీజ్ చేసి ఆరుగురిపై కేసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

నకిలీ, తారుమారు చేసిన లేదా అనధికారిక నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక తనిఖీలను ముమ్మరం చేశారు. మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు, ఇప్పటివరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ వెల్లడించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.