వికాస్ కాలేజ్‌లో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఓర్పు, క్రమశిక్షణ, నిరంతర కృషితో ముందుకు సాగాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ సూచించారు. గంజాయి, డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారని విజయవాడ సిటీ పోలీసులు వెల్లడించారు.