తిరుమలలో రికార్డు స్థాయిలో రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారికి గురువారం రికార్డు స్థాయిలో రూ.6.93 కోట్ల హుండీ కానుకలు లభించాయి. తితిదే చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని కానుకలు రావడం విశేషం. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈనెల 13న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది.