ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, అడ్వాన్స్ నిబంధనలు సరళీకరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ నిబంధనలను సరళీకరించింది. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు. విద్యకు 10 సార్లు, వివాహాలు మరియు గృహ అవసరాలకు 5 సార్లు పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు కల్పించారు. నిరుద్యోగ సమయంలో లేదా 12 నెలల సభ్యత్వం తర్వాత 75 శాతం వరకు పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునేలా కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి.