బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Mumbai
ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ (75) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఒక అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి గోప్యత ఇవ్వాలని వారు కోరారు. కృష్ణ ముఖర్జీ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గా వ్యవహరించడంతో పాటు, రాణి ముఖర్జీని నటిగా వెండితెరకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.