ఎల్ నినో ప్రభావంతో ఈసారి తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో నైరుతి రుతుపవనాల కాలం ముగిసిందని, ఎల్ నినో ప్రభావంతో ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది వర్షాకాలం 13 శాతం లోటు వర్షపాతంతో ముగిసిందని అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని, పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది.