ఉద్యోగ విరమణ ప్రకటన ఇవ్వగానే ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థ
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
నాల్గేళ్లుగా సంస్థలో పని చేసి రాజీనామా చేసిన ఉద్యోగిని యాజమాన్యం వెంటనే తొలగించిందని రెడిట్ వేదికగా ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన అవకాశం వచ్చిందని రెండు వారాల ముందే నోటీసు ఇచ్చి హ్యాండోవర్ డాక్యుమెంట్‌తో మేనేజర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని ఉద్యోగి తెలిపారు. తన ఈమెయిల్, స్లాక్ యాక్సెస్‌లను నిలిపివేశారని, కనీసం సహోద్యోగులకు వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన వాపోయారు.