నెల్లూరులో శిథిలావస్థకు జిల్లా ప్రధాన గ్రంథాలయం: అసంపూర్తిగా కొత్త భవన నిర్మాణం

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా ప్రధాన గ్రంథాలయం తీవ్రమైన వసతుల లేమితో శిథిలావస్థకు చేరిందని, కొత్త భవన నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి కుమార్రాజా తెలిపారు. స్టోన్హౌస్పేటలోని లైబ్రరీలో మురుగు నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్పొరేషన్ నుంచి రావాల్సిన సెస్సు నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అధికారులు పేర్కొన్నారు.