హామీలు అమలు చేయాలి.. ఎంపీడీవోకు బీఆర్ఎస్ వినతి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సోమవారం ఎంపీడీవో కూతల నాగవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్, మాజీ సర్పంచుల పురం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, జలసాధన సమితి కన్వీనర్ ఎర్ర గోకుల జస్వంత్, పట్టణ అధ్యక్షులు బెడిదే వీరేశం తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.