తెలంగాణను ఏటీఎంగా మార్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తెలంగాణను ఢిల్లీ పెద్దలకు ఏటీఎంగా మార్చారని, కాంగ్రెస్ పార్టీ 'ఖటాఖట్' హామీల అమలులో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. దిల్లీ హైకమాండ్ కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు కాకపోగా, అపఖ్యాతి మూటగట్టుకున్న 'ఆర్ఆర్ టాక్స్' విపరీతంగా పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని పేర్కొంటూ ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.