రాష్ట్రంలో ట్రెమడాల్‌ ఇంజెక్షన్ల విక్రయాల్లో భారీ ఉల్లంఘనలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాల్లో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు జరిపిన తనిఖీలలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. నొప్పుల నివారణకు వాడే ట్రెమడాల్‌ ఇంజెక్షన్లను మత్తు కోసం విక్రహిస్తున్న 55 దుకాణాలను గుర్తించారు. నకిలీ బిల్లులతో అడ్డదారిన అమ్మకాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ అరుణ్‌బాబు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం అక్రమ నిల్వలపై ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు.