స్వర్ణగిరి క్షేత్రంలో వైదిక పూజలతో పునీతులైన భక్తజనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం నిత్య పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక అర్చనలు జరిగాయి. రాత్రి వేళ శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చక స్వాములు సహస్ర కుంకుమార్చన సేవను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు.