దేశంలోనే ఉత్తమ యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్‌గా ఈగల్ ఎంపిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌గా ఎంపికైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ చీఫ్ సందీప్ శాండిల్యతో పాటు మొత్తం బలగాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. మూడవ జాతీయ ఏఎన్టీఎఫ్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు.