రైల్వేస్టేషన్లలో తాగునీటి తిప్పలు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం ఉమ్మడి జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో తాగునీటి పరిస్థితి దారుణంగా తయారైందని, కుళాయిల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి నాచుపట్టినా అధికారుల పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం, కొత్తవలస స్టేషన్లలో ట్యాపులు పాడై నీరు వృథాగా పోతుండగా, శీతల యంత్రాలు పనిచేయక ప్రయాణికులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.